షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ని ప్రకటించిన మంచు విష్ణు

షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ని ప్రకటించిన మంచు విష్ణు

Published on Jan 17, 2015 2:54 AM IST

vishnu123
ఒక సినిమాని తెరకెక్కించి దాని తెరపై దర్శకుడిగా పేరు వేయించుకోవాలని కలలు కని, అనునిత్యం తపనపడే రోజులు పోయాయి. షార్ట్ ఫిలిం మాధ్యమం ద్వారా తమ ప్రతిభను చూపిస్తూ ఎంతో మంది యువ దర్శకులు యేటా మన తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నారు.వీరి టాలెంట్ ని వెలికి తీసే క్రమంలో పలువురు సినీ ప్రముఖులు కాంటెస్ట్ ల ద్వారా సహాయపడుతున్నారు. వీరి జాబితాలోకి నటుడు, నిర్మాత అయిన మంచు విష్ణు కూడా చేరాడు.

దర్శకుడిగా తెలుగు సినిమా రంగాన్ని ఏలాలి అనే తపన కలిగిన వున్న వారంతా ఈ జనవరి 15నుండి జరగనున్న వార్షిక లఘు చిత్రాల పోటీలో పాల్గుని విష్ణుని మెప్పించగలిగితే తన సొంత బ్యానర్ అయిన 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలో ఒక సినిమా ఛాన్స్ ఇస్తానని తెలిపాడు. ఈ పోటికి సంబంధించిన మరిన్ని వివరాలకోసం మా సైట్ ని చూస్తూ వుండండి.

తాజా వార్తలు