రాజమండ్రిలో సందీప్ కిషన్ ‘టైగర్’ షూటింగ్..!

రాజమండ్రిలో సందీప్ కిషన్ ‘టైగర్’ షూటింగ్..!

Published on Jan 20, 2015 8:26 AM IST

tiger
సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ హీరోలుగా ఏఆర్ మురుగదాస్ శిష్యుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘టైగర్’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రిలో జరుగుతుంది. పుష్కరాల రేవు వద్ద హీరో సందీప్ కిషన్, నటుడు ప్రవీణ్ లపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇద్దరు అగ్ర నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గంగానది నేపథ్యంలో విభిన్న కథాంశంతో రూపొందుతున్న సినిమా ఇదని నిర్మాతలు తెలిపారు. వారణాసి(కాశి)లో ఓ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు