
ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమా రోజురోజుకూ తన స్థానాన్ని పెంచుకుంటూపోతుంది. టాలీవుడ్ లో ఇప్పటివరకూ ఏ చిత్రానికీ రాని హైప్, క్రేజ్ ఈ సినిమా అందుకుంటుంది. సినిమాలో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరూ ఈ చిత్రంలో నటించడం తమకు దక్కిన వరమని తెలుపుతున్నారు
తాజా సమాచారం ప్రకారం తమిళ పంపిణీదారుల హక్కులను స్టూడియో గ్రీన్ బ్యానర్ సహకారంతో యు.వి క్రియేషన్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ సంస్థ మిర్చి, రన్ రాజా రన్ సినిమాలను నిర్మించిన సంగతి తెలిసినదే.
ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నారు. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు. కీరవాణి సంగీత దర్శకుడు.

