రజినీలో మంచి స్క్రీన్ ప్లే, దర్శకుడు ఉన్నారు – ఇళయరాజా

రజినీలో మంచి స్క్రీన్ ప్లే, దర్శకుడు ఉన్నారు – ఇళయరాజా

Published on Jan 22, 2015 1:25 AM IST

ilayaraj-arajinikanth
మంగళవారం రాత్రి ముంబైలో ‘షమితాబ్’ ఆడియో వేడుక ఆద్యంతం ఆహుతులను అలరిస్తూ సాగింది. 1000 సినిమాలకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు, మేస్ట్రో ఇళయరాజాను ‘షమితాబ్’ యూనిట్ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమానికి హాజరయిన అమితాబ్, రజినీకాంత్, కమల్ హాసన్ లు ఇళయరాజా సంగీతంలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ స్టార్ హీరోల గురించి పలు ఆసక్తికరమైన అంశాలను ఇళయరాజా వెల్లడించారు.

రజినీకాంత్ లో ఓ మంచి దర్శకుడు దాగి ఉన్నాడు. అతనో అద్భుతమైన స్క్రీన్‌ప్లే రచయిత. ఆ విషయం రజినీతో చెప్తూ, మీ సినిమాలకు మీరే ఎందుకు రాయకూడదని అడిగాను. సినిమా రచన అనేది భిన్నమైన పని అంటూ రజిని నవ్వేశారు అని ఇళయరాజా గతాన్ని గుర్తుచేసుకున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లు మంచి గాయకులు అని కితాబిచ్చారు. అమితాబ్ మాత్రం ఇళయరాజా ముందు పాడే సాహసం ఎప్పడూ చేయలేదని అన్నారు. ‘షమితాబ్’లో అమితాబ్ చేత ఇళయరాజా పాడించిన పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

తాజా వార్తలు