అక్కినేని నాగేశ్వర రావు, తెలుగు తెరపై చెరగని సంతకం చేసిన మహా నటుడు. రొమాంటిక్ సినిమాలకు చిరునామా. తన సినిమాలతో ప్రేక్షకులకు ఎన్నో మధుర స్మృతులు మిగిల్చిన ఈ నట శిఖరం ఈ లోకం విడిచి సరిగ్గా నేటికి ఒక ఏడాది పూర్తయింది. ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన అక్కినేని చాలా చిన్న వయసులో స్టేజి నాటకాలలో అడుగు పెట్టారు. ఆ వెంటనే ‘ధర్మపత్ని’ సినిమాతో సినీ రంగంలో ప్రవేశించారు.
ఏడు దశాబ్దాల సుదీర్గమైన కెరీర్లో అక్క్కినేని ఎన్నో మధురమైన సినిమాలలో నటించారు. పలు సినిమాలకు తన అద్బుతమైన నటనతో వన్నె తీసుకొచ్చారు. ‘దేవదాసు’, ‘ప్రేమ నగర్’, ‘డాక్టర్ చక్రవర్తి’, వంటి సినిమాలకు రొమాంటిక్ క్యారెక్టర్లలో జీవించాలంటే, తన తర్వాతే ఎవరైనా అనే పేరు తెచ్చుకున్నారు.
తెలుగు సినిమా స్వర్ణ యుగంలో ఎన్టీఆర్, అక్కినేనిల పాత్ర చిరస్మరణీయం. వీరిద్దరూ కలిసి అనేక క్లాసికాల్ సినిమాలలో నటించారు. 1975 లో అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్మించారు ఆ తర్వాత అదే పేరు మీద బ్యానర్ స్థాపించి పలు విజయవంతమైన సినిమాలను నిర్మించారు. 1991 లో భారత ప్రభుత్వం అక్కినేనిని ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంతో సత్కరించింది. తర్వాత సినిమా రంగానికి చేసిన సేవలకు గాను భారతదేశంలో రెండవ అత్యున్నత గౌరవనీయమైన పద్మ విభూషణ్ పురస్కారం ఆయన్ను వరించింది.
అక్కినేని నాగేశ్వరరావు మన మనస్సులో ఎప్పుడు జీవించే ఉంటారు.


