
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హి ఈజ్ బ్యాక్, ఓ రేంజ్ లో రికార్డ్స్ సృష్టిస్తున్నాడు.. ఎక్కడ, ఎలా అనుకుంటున్నారా.? ఎన్.టి.ఆర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలిసి ‘టెంపర్’ అనే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఎన్.టి.ఆర్ ఇది వరకూ ఎన్నడూ కనిపించని స్టైలిష్ లుక్ లో, న్యూ డైలాగ్ డెలివరీ, డిఫరెంట్ పెర్ఫార్మన్స్ తో రానున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే జరిగిన ఆడియో లాంచ్ లో రిలీజ్ చేసిన ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడమే కాకుండా యు ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
రికార్డ్ స్థాయిలో మూడు రోజుల్లోనే 1 మిలియన్ వ్యూస్ ని సాధించి రికార్డ్ సృష్టించింది. ఈ రికార్డ్ ని చాలా తక్కువ సినిమాలు మాత్రమే సాధించగలిగాయి. అంతే కాకుండా యు ట్యూబ్ టాప్ లిస్టు లో కంటిన్యూగా కొనసాగుతోంది. దీన్నిబట్టే ఈ సినిమాపై ప్రేక్షకులలో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయనేది తెలుస్తుంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకునే స్టేజ్ లో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది.
టైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

