సునీల్ – దిల్ రాజుల సినిమాకు టైటిల్ దొరికింది.

సునీల్ – దిల్ రాజుల సినిమాకు టైటిల్ దొరికింది.

Published on Feb 4, 2015 11:35 PM IST

Sunil_Dil_Raju
కమెడియన్ నుండి హీరోగా ప్రమోట్ అయిన సునీల్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘జోష్’ ఫేం వాసు వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘మలుపు’ అనే టైటిల్ ఖరారు చేశారు.

సునీల్ కెరీర్లో ‘మర్యాద రామన్న’ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ ఈ సినిమాతో అందుకుంటాడు అనే ధీమాను నిర్మాత వ్యక్తం చేశారు. విడుదల తర్వాత సునీల్ కెరీర్ ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

సునీల్ సరసన నిక్కి గార్లని హీరోయిన్ గా నటిస్తుంది. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతున్న ఈ సినిమాకు కోన వెంకట్, గోపి మోహన్ రచనా సహకారం అందిస్తున్నారు. దినేష్ సంగీతం అందిస్తున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు