‘కొబ్బరిమట్ట’లో పాట పాడిన సంపూర్నేష్ బాబు.

‘కొబ్బరిమట్ట’లో పాట పాడిన సంపూర్నేష్ బాబు.

Published on Feb 7, 2015 6:10 PM IST

kobaari-matta

‘హృదయ కాలేయం’ తర్వాత బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు, దర్శకుడు స్టీవెన్ శంకర్ అలియాస్ సాయి రాజేష్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘కొబ్బరిమట్ట’. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలను స్టీవెన్ శంకర్ అందించాగా రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో సంపూ త్రిపాత్రాభినయం చేస్తుండడం విశేషం. అంతే కాదు, మరొక విశేషం కూడా ఉందండోయ్.. కమ్రాన్ సంగీతంలో సంపూర్నేష్ బాబు ఓ పాట కూడా పాడారు. ‘కొబ్బరి పుల్లలు కలగలిపే.. ‘ అంటూ సాగే ఈ గీతాన్ని కిట్టు విస్సాప్రగడ రచించారు. ఈ వారమే సంపూర్నేష్ బాబు స్వయంగా పాడిన ‘కొబ్బరిమట్ట’ సాంగ్ వీడియో & మేకింగ్ వీడియో విడుదల చేస్తున్నారు.

‘హృదయ కాలేయం’ తరహాలో ఈ ‘కొబ్బరిమట్ట’ చిత్రం కూడా సంచలన విజయం సాధిస్తుందని సంపూర్నేష్ బాబు & కో ఆశిస్తుంది. ఈ చిత్రాన్ని ఆది కుంభగిరి నిర్మించారు.

తాజా వార్తలు