
మెగా పవర్ త్వరలో తన తదుపరి సినిమా ‘నా పేరే రాజు’ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నారు. ఇది పక్కన పెడితే రామ్ చరణ్ ఇటీవలే ఓ లాండ్ క్రూజర్ కార్ ని కొన్నారు. ఈ కారు కోసం రామ్ చరణ్ ఒక డీసెంట్ అమౌంట్ పెట్టి ఒక ఫ్యాన్సీ నెంబర్ ని కొన్నారు. రామ్ చరణ్ తన ల్యాండ్ క్రూజర్ కోసం బుక్ చేసిన నెంబర్ టిఎస్ 09 ఇఇ 1111 అనే నెంబర్ ని ఖైరతాబాద్ ఆర్.టి.ఎ ఆఫీస్ నుంచి తీసుకున్నారు.
ఈ నెంబర్ కోసం రామ్ చరణ్ ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు. మామూలుగానే ఫిల్మ్ స్టార్స్ అందరూ తమ కార్స్ లేదా మొబైల్స్ విషయంలో ఫ్యాన్సీ నెంబర్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఎన్.టి.ఆర్ కూడా తన కార్స్ కోసం ఫ్యాన్సీ అమౌంట్ పెట్టి ఫ్యాన్సీ కార్స్ ని కొనుగోలు చేస్తుంటారు. ఇటీవలే చరణ్ కొన్న ఈ కారుని ఆయన రెగ్యులర్ గా వినియోగిస్తున్నారు. చరణ్ తదుపరి చినెమాలొఉ శ్రీను వైట్ల మరియు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఉంటాయి.

