త్రిష సినిమాలో ప్రభుదేవా

త్రిష సినిమాలో ప్రభుదేవా

Published on Feb 11, 2015 1:14 PM IST

trisha-prabhudeva
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా సౌత్ ఇండియన్ సినిమాలలో కనిపించి చాలా రోజులయింది. హిందీ చిత్రసీమలో దర్శకుడిగా బిజీ అయిన తర్వాత నటనపై పెద్దగా దృష్టి పెట్టలేదు. తాజాగా దర్శకుడు తిరు చెప్పిన కథ, ప్రభుదేవా మనసును కదిలించడంతో ముఖానికి మేకప్ వేసుకోవడానికి రెడీ అయ్యారు.

తమిళ హీరో జై, త్రిష జంటగా తిరు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభుదేవా కీలక పాత్రలో నటించనున్నారు. హీరో పెద్దన్నయ్య పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాను త్రిషకు కాబోయే భర్త వరుణ్ మణియన్ నిర్మిస్తుండడం విశేషం. సుశాంత్ ప్రసాద్ మరో నిర్మాత భాగస్వామ్యంతో సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు.

తాజా వార్తలు