శాటిలైట్ రైట్స్ లో రికార్డ్ క్రియేట్ చేసిన శర్వానంద్

శాటిలైట్ రైట్స్ లో రికార్డ్ క్రియేట్ చేసిన శర్వానంద్

Published on Feb 11, 2015 4:18 PM IST

Malli-Malli-idi-rani-roju
‘రన్ రాజా రన్’ లాంటి కమర్షియల్ సబ్జెక్ట్ తో సూపర్ హిట్ అందుకున్న శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’. ఈ సారి కమర్షియల్ సబ్జెక్ట్ కాకుండా అప్యూర్ లవ్ స్టొరీతో వచ్చిన ఈ సినిమా కూడా శర్వానంద్ కి మంచి విజయాన్ని అందించింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి అందరూ చూడాల్సిన ఫీల్ గుడ్ లవ్ స్టొరీ అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టుకోవడమే కాకుండా శాటిలైట్ రైట్స్ విషయంలో రికార్డ్ ప్రైజ్ పలికింది.

‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమా శాటిలైట్ రైట్స్ ని మా టీవీ వారు 4.15 కోట్లకి సొంతం చేసుకున్నారు. శర్వానంద్ కెరీర్లోనే మొదటిసారిగా అత్యంత భారీ రేటుకి శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయాయి. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కి ఈ రేంజ్ రేటు రావడంతో ప్రొడక్షన్ టీం చాలా హ్యాపీ గా ఉంది. నిత్యామీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి క్రాంతి మాధవ్ డైరెక్టర్. హిందూ – ముస్లీం కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ ప్రేమకథ అందరికీ నచ్చేలా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది.ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎ వల్లభ నిర్మించాడు.

తాజా వార్తలు