ఫిబ్రవరి 27న హవీష్ ‘రామ్ లీల’ గ్రాండ్ రిలీజ్

ఫిబ్రవరి 27న హవీష్ ‘రామ్ లీల’ గ్రాండ్ రిలీజ్

Published on Feb 12, 2015 12:24 PM IST

ram-leela

హవీష్, అభిజిత్, నందిత నటినటులుగా శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రామ్ లీల’. కోనేరు సత్యనారాయణ సమర్పణలో రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు చిన్నా మరియు శివమణి సంగీతం అందించారు. ఈ సినిమాకి చెందిన షూటింగ్, నిర్మాణంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇటీవలే ఈ సినిమా ఆడియోని లాంచ్ కార్యక్రమంలో లాంచ్ చేసిన ఫస్ట్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ ఇచ్చాడు. గత కొద్ది రోజులుగా ఈ చిత్ర టీం సరైన రిలీజ్ డేట్ ని ఫిక్స చేసే పనిలో ఉన్నారు. ముందుగా ఫిబ్రవరి 20వ తేదీని పరిశీలించినా ఫైనల్ గా ఫిబ్రవరి 27న గ్రాండ్ రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది.

ట్రై యాంగిల్ లవ్ స్టొరీలా అనిపిస్తున్న ఈ సినిమా పాటలకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా అంపై హవీష్ చాలా నమ్మకంగా ఉన్నాడు. మలేసియా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో లవ్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ తరహా ప్రేమకథను తెరకెక్కించడం ఇదే మొదటిసారని, హవీష్, అభిజిత్ ల పాత్రలు చాలా బాగుంటాయని ఈ చిత్ర టీం అంటోంది. ఎస్. గోపాల్‌రెడ్డి ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు.

తాజా వార్తలు