ఆడిషన్ లేకుండానే ఎంపికయ్యా – అఖిల్ హీరోయిన్

ఆడిషన్ లేకుండానే ఎంపికయ్యా – అఖిల్ హీరోయిన్

Published on Feb 12, 2015 10:42 PM IST

Sayessha-Saigal
భారతీయ చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఒకరైన దిలీప్ కుమార్ మనవరాలు సాయేషా సైగల్ త్వరలో తెలుగు తెరపై సందడి చేయడానికి సిద్దమయ్యింది. ప్రిన్స్ అక్కినేని అఖిల్ పరిచయ చిత్రంలో ఈ ముంబై ముద్దుగుమ్మను హీరోయిన్ గా ఎంపిక చేశారు. గత రెండు రోజుల నుండి ఈ అమ్మడి ఫోటోల కోసం యువత ఇంటర్నెట్లో తెగ వెతుకుతున్నారు. ఇక్కడి ప్రేక్షకులకు సాయేషా సైగల్ బాగా నచ్చింది.

వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ సరసన నటించడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నాను. ఆడిషన్ చేయకుండానే నన్ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. వినాయక్ గారికి నేను బాగా నటించగలను అనే నమ్మకం. ఎందుకంటే నటీనటుల కుటుంబం నుండి వచ్చాను కదా..! నా తల్లిదండ్రులు షహీన్, సుమిత్ సైగల్ సైతం హిందీలో మంచి పేరున్న నటులు. వారి వారసత్వాన్ని కొనసాగిస్తాను అనే నమ్మకం ఉంది. ఎక్కువ ప్రెజర్ ఫీలవ్వడం లేదు. అని సాయేషా సైగల్ తెలిపింది.

తాజా వార్తలు