మొదటిరోజే అబ్బురపరిచే కలెక్షన్లను సొంతం చేసుకున్న ‘టెంపర్’

మొదటిరోజే అబ్బురపరిచే కలెక్షన్లను సొంతం చేసుకున్న ‘టెంపర్’

Published on Feb 14, 2015 10:45 PM IST

temper
నందమూరి తారకరాముడు నటించిన ‘టెంపర్’ విజయం సాధించడంతో యంగ్ టైగర్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. నిన్న విడుదలైన నాటినుండి హౌస్ ఫుల్ షోలతో నడుస్తున్న ఈ సినిమా భారీ హిట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆంధ్రా తెలంగాణాలలో మొదటిరోజే 10కోట్లు సాధించింది.

పూరి జగన్ తెరకెక్కించిన ఈ సినిమా గుంటూరు లో 1.38కోట్లు, పశ్చిమగోదావరిలో 66లక్షలు, నిజాం లో 2.71కోట్లు, తూర్పు గోదావరి మరియు వైజాగ్ లలో 85 మరియు 71 లక్షలు సాధించింది. పూరి జగన్ డాషింగ్ డైరెక్షన్, తారక్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ సినిమాకు అండగా నిలిచాయి.

తాజా వార్తలు