
ప్రపంచం మొత్తం ఉన్న క్రికెట్ అభిమానులతో పాటు ఇండియా – పాకిస్తాన్ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ ఈ రోజు మొదలైంది. ఈ మ్యాచ్ లో ఇండియా గెలవాలని ఇండియా లోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. వీరిలో తెలుగు ఫిలిం సెలబ్రిటీస్ కూడా ఈ మ్యాచ్ చూడటానికి, ఈ మ్యాచ్ ని గెలిపించడానికి సిద్దంగా ఉన్నారు. అందులో భాగంగా టాలీవుడ్ లోని ప్రముఖ హీరోలైన వెంకటేష్, ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్, నితిన్, నిఖిల్, శ్రుతి హాసన్, ప్రియమణి తదుఇతరులు ఇండియాకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
టాలీవుడ్ తెలుగు వారియర్స్ టీం కూడా ఈ సంవత్సరం క్రికెట్ లో తమ టాలెంట్ ని చూపించి సిసిఎల్ 5 త్రోపీని కూడా దక్కించుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి టీం ఇండియాని గెలిపించాలని ప్రార్ధనలు చేస్తున్నాడు. ఈ రోజు ఉదయం ప్రారంభమైన క్రికెట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీం ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసి 301 పరుగులు టార్గెట్ ని పాకిస్తాన్ ముందు ఉంచింది. ఇండియా టీం లోని విరాట్ కోహ్లీ 107 పరుగులు చేయగా, ధావన్ 73, రైనా 74 పరుగులు చేసారు. మరి ఈ లక్ష్యాన్ని పాకిస్తాన్ చేదిస్తుందా లేదా అనేది చూడాలి..

