సుధీర్ బాబు మూవీకి మహేష్ ప్రచారం చేయనున్నాడా.?

సుధీర్ బాబు మూవీకి మహేష్ ప్రచారం చేయనున్నాడా.?

Published on Feb 15, 2015 3:36 PM IST

Mahesh-Babu-Sudheer-Babu
‘ప్రేమకథా చిత్రమ్’ తో హిట్ అందుకున్న తర్వాత యంగ్ హీరో సుధీర్ బాబు మరో హిట్ కోసం చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ప్రేమ కథా చిత్రమ్ లో సుధీర్ బాబుతో జత కట్టిన నందిత మరోసారి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఆర్.చంద్రు దర్శకత్వంలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకి సిద్దంగా ఉంది. ముందుగా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చెయ్యాలని అనుకున్నా కుదరకపోవడంతో ఈ చిత్ర తేమ మరో మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఇది పక్కన పెడితే మొదట ఈ సినిమాలో మహేష్ బాబు అతిధి పాత్రలో కనిపిస్తాడని అన్నారు కానీ అందులో నిజం లేదని సుదీర్ బాబు తెలిపాడు. ఈ మూవీ ఆడియో లాంచ్ కి కూడా మహేష్ వస్తారనుకున్నారు కానీ రాలేదు. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో పాల్గొంటాడని సమాచారం. మహేష్ బాబు త్వరలోనే ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ షో చూసి ప్రమోస్ట్ చేస్తాడని సమాచారం.

ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య, దగ్గుబాటి రానా అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. కన్నడలో మంచి విజయం సాదించిన ‘చార్మినార్’ ఈ చిత్రానికి రీమేక్ గా ఇది తెరకెక్కుతోంది.

తాజా వార్తలు