
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లింగ’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా వల్లా డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంది రోడ్డు మీదకి అవ్చ్చేసారు. అప్పటి నుంచే డిస్ట్రిబ్యూటర్స్ కి – నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కి మధ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ చర్చల్లో ఫైనల్ గా రాక్ లైన్ వెంకటేష్ 10% మాత్రమే వెనక్కి ఇస్తానని చెప్పడంతో వారు మళ్ళీ ఎదురు దాడికి దిగారు. అందుకే ఆ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి సరికొత్తగా వారి నిరసనలు తెలియజేయడానికి నిర్ణయించుకున్నారు. అందుకే వీళ్ళందరూ రజినీకాంత్, థియేటర్స్ ముందు బిక్షం ఎత్తుకోవాలని నిర్ణయించుకున్నారు.
డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఇక నుంచి రజినీకాంత్ ఇంటి ముందు బిక్షాటన చేయాలని, అలాగే ఏ ఏ థియేటర్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేసారో అక్కడ రోజు అడుక్కోవాలని వారు డిసైడ్ అయ్యారు. అంతే కాకుండా ప్రతి సినిమా థియేటర్లో ఒక బిక్షం ఎత్తుకునే ఒక బౌల్ పెట్టి అందులో థియేటర్ కి వచ్చే ఆడియన్స్ వీలైనంత దానం చెయ్యాలని కోరటం. వాళ్ళు ఇచ్చే డబ్బు మా రికవరీకి కొంతైనా హెల్ప్ అవుతుందని వారు అంటున్నారు. మరి డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్న ఈ నిర్ణయానికి నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

