యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరికొత్త క్యారెక్టరైజేషన్లో.. ఎటువంటి దయా లేని 100% కన్నింగ్, కరప్టట్డ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమా ‘టెంపర్’. అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన దయా.. నీతిపరుడుగా ఎలా మారాడు అనేది సినిమా కధాంశం. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులకు బాగా నచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ స్టామినాను ‘టెంపర్’ సినిమా ఘనంగా చాటి చెప్పింది. ఇప్పటికే అమెరికాలో రికార్డు కలెక్షన్స్ సాదించిన ఈ సినిమా ఇతర విదేశాలలో సైతం సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలో ఎన్టీఆర్ గత సినిమా కలెక్షన్స్ ను ‘టెంపర్’ సినిమా కేవలం రెండు రోజుల్లో అధిగమించింది. దుబాయ్, కువైట్ లలో అనేక రికార్డులను తిరగరాసిన ‘టెంపర్’ సినిమా నెంబర్ వన్ గ్రాస్ కలెక్షన్స్ సాదించే దిశగా వెళ్తుంది. యుకె మరియు ఇతర యూరోప్ దేశాలలో మంచి వసూళ్లు సాదిస్తుంది.
పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.


