భారి సినిమాలతో పాటు చిన్న సినిమాలను నిర్మిస్తా – బండ్ల గణేష్

భారి సినిమాలతో పాటు చిన్న సినిమాలను నిర్మిస్తా – బండ్ల గణేష్

Published on Feb 16, 2015 3:55 PM IST

Bandla-Ganesh1

ఇటివల కాలంలో భారి సినిమాలకు కేరాఫ్ అడ్రస్ నిలిచిన నిర్మాతలలో బండ్ల గణేష్ ఒకరు. తను నిర్మించే ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ చేయడానికి ప్రయత్నిస్తారు. బండ్ల గణేష్ నిర్మించే సినిమాలలో భారితనం కనిపిస్తుంది. ‘టెంపర్’ సినిమాతో భారి సక్సెస్ సొంతం చేసుకున్న ఈ నిర్మాత ఇకపై చిన్న సినిమాలపై దృష్టి పెడతానని చెప్పారు.

భారి బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలు, లో బడ్జెట్ సినిమాలు తీయాలని ఉంది. కొత్త దర్శకులతో కూడా పని చేయడం కోసం ఎదురుచూస్తున్నాను. పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై వరుసగా సినిమాలు నిర్మించాలని భావిస్తున్నాను అని ఇటివల ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ తెలిపారు.

దర్శకులు కావాలని కలలు కంటున్న యువతకు ఇదొక లక్కీ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం.. మీ కథలను బ్లాక్ బస్టర్ నిర్మాతకు వినిపించడానికి బయలుదేరండి.

తాజా వార్తలు