మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘కిక్ 2’. ఇటీవలే జైసల్మీర్ లో క్లైమాక్స్ షూట్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హంపిలో జరుగుతోంది. అక్కడ కిక్ 2 చిత్ర టీం వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్స్ కి అతిక్రమించి కొన్ని పనులు చేసారు. అవి ఇప్పుడు వారికి ఎక్కడ లేని తిప్పలు తెచ్చి పెట్టాయి.
అసలు విషయంలోకి వెళితే ‘కిక్ 2 చిత్ర టీంకి కొన్ని లిమిటేషన్స్ తో హంపి లో షూటింగ్ కి పర్మిషన్ ఇచ్చారు కానీ మన కిక్ 2 టీం మాత్రం వాటిని పక్కన పెట్టి వెహికల్స్ తీసుకెళ్ళ కూడని ప్రాంతంలోకి కూడా భారీ వెహికల్స్ ని తీసుకెళ్ళారు. అది చాలా పాత కట్టడం కాబట్టి లోడెడ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ లోడ్ వెహికల్స్ ని తీసుకు రాకూడదని, అలా వస్తే అక్కడి కట్టడాలు కూలిపోతాయని అక్కడ సెక్యూరిటీ వారు చెప్పినా వినిపించుకోకుండా లోడెడ్ వెహికల్స్ ని తీసుకెళ్ళి షూటింగ్ చేస్తున్నారు. దీనివల్ల అక్కడి హంపి కట్టడాలకి ఎఫెక్ట్ అని అక్కడి వారు వాగ్వాదానికి దిగారని’ సమాచారం. ప్రస్తుతం ఈ వార్త హంపి మరియు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. మరి ఈ విషయంపై కిక్ 2 టీం ఎలా స్పందిస్తారనేది చూడాలి.
రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సురేందర్ రెడ్డి డైరెక్టర్. నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.


