‘ఇష్క్’ కి అందించిన మ్యూజిక్ స్టైల్ తనకిష్టమంటున్న అనుప్ రుబెన్స్

‘ఇష్క్’ కి అందించిన మ్యూజిక్ స్టైల్ తనకిష్టమంటున్న అనుప్ రుబెన్స్

Published on Feb 16, 2015 11:58 PM IST

Anup-Rubens-(23)
ప్రస్తుత తరం సంగీత దర్శకులలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు అనూప్ రూబెన్స్. ఈ యువ సంగీత కెరటానికి నితిన్, నిత్యామీనన్ లు జంటగా నటించిన ‘ఇష్క్’ సినిమా మాదిరి సంగీతం అందించడం ఇష్టమట. 2012లో విడుదలైన ‘ఇష్క్’ చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలిచింది. నితిన్, అనూప్ లకు ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. పదేళ్ళుగా ఇండస్ట్రీలో వున్నా రాని పాపులారిటీ ఒక్క విజయంతో అనూప్ కి దక్కింది.

ఆ తరువాత అనూప్ వరుసపెట్టి హిట్ మ్యూజికల్ హిట్స్ ని అందించాడు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మనం’, ‘హార్ట్ ఎటాక్’ లకు మంచి బాణీలను అందించి వాటి పనితీరుతో పెద్ద సినిమాల ఆఫర్లను అందుకున్నాడు. వెంకటేష్ – పవన్ ల ‘గోపాల గోపాల’, పూరి – తారక్ ల ‘టెంపర్’లు సైతం విజయాలు సాధించాయి.

ప్రస్తుతం అనూప్ చేతిలో అఖిల్ తొలి చిత్రం మరియు పవన్ కళ్యాణ్ చిత్రం వున్నాయి.

తాజా వార్తలు