
ప్రస్తుతతరంలో తమిళ సూపర్ స్టార్ ధనుష్ టాలెంటెడ్ నటులలో ప్రధమవరుసలో వుంటాడని చెప్పచ్చు. అతిపిన్న వయసులో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ఈ నటుడు వరుసపెట్టి తమిళ, హిందీ చిత్రసీమలో భారీ సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ తో పాటూ షమితాబ్ సినిమాలో నటించిన తీరుకి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలేకాక సినీ ప్రముఖుల మన్ననలను పొందాడు.
సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచినా ధనుష్ నటనని లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రత్యేక షో ద్వారా తిలకించి తన నటనను మెచ్చుకున్నాడు. ఆ పొగడ్త వినగానే ధనుష్ ఆనందానికి అవధులు లేవు. మణిరత్నం తదుపరి చిత్రం ధనుష్ తోనే వుంటుందని ఒక పుకారు సైతం నడుస్తుంది.
ధనుష్ తాజా చిత్రం ‘అనేగన్’ తమిళనాట మంచి విజయం సాధించి తెలుగులో విడుదలకు సిద్ధపడుతుంది.

