
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు బాలీవుడ్ స్టంట్ మాస్టర్ యాక్షన్ అణల్ అరసు వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులో జరుగుతుంది. పొల్లాచ్చి, పళని, కారైకుడి ప్రాంతాలలో షూటింగ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో అణల్ అరసు నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.
సల్మాన్ ఖాన్ ‘కిక్’, అక్షయ్ కుమార్ ‘రౌడీ రాథోడ్’, ‘హీరోపంటి’ తదితర బాలీవుడ్ సినిమాలకు, తెలుగులో ప్రభాస్ ‘మిర్చి’ సినిమాకు అణల్ అరసు స్టంట్స్ డిజైన్ చేశారు. స్టయిలిష్ & రియలిస్టిక్ స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలకు అణల్ అరసు బాగా ఫేమస్. ప్రస్తుతం గోపీచంద్ ‘జిల్’ సినిమాలకు అణల్ అరసు వర్క్ చేస్తున్నారు.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. యలమంచిలి రవి శంకర్, సివి మోహన్, ఎర్నేని నవీన్ నిర్మాతలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ సినిమాకు ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

