మహేష్ బాబుని మెప్పించిన ‘టెంపర్’

మహేష్ బాబుని మెప్పించిన ‘టెంపర్’

Published on Feb 18, 2015 1:35 AM IST

mahesh_babu4
నందమూరి తారకరామారావు నటించిన ‘టెంపర్’ ఈ ఏడాది మొట్టమొదటి భారీ మాస్ చిత్రంగా గుర్తింపు దక్కించుకుంది. సినిమా చూసినవారంతా పూరి యంగ్ టైగర్ ని చూపించిన విధానంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీరి జాబితాలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరారు.

ఒక ప్రముఖ టి.వి ఛానల్ తో మాట్లాడుతూ పూరి జగన్నాధ్ స్వయంగా ఈ విషయం వెల్లడించాడు. మహేష్ తనకు పెర్సనల్ గా ఫోన్ చేసి చాలా సేపు తారక్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ గురించి చర్చించినట్టు తెలిపాడు. మహేషేకాక చాలామంది టాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకుంటున్నట్టు, ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా వున్నట్టు తెలిపాడు.

తాజా వార్తలు