
నవదీప్, నవీన్ చంద్ర, పూజ జావేరి నటిస్తున్న’భం భోలేనాథ్’ విడుదల ఈ నెల 27 కి వాయిదాపడింది ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కావాల్సివుండగా చివరి నిమిషంలో వాయిదాపడినట్టు ప్రకటించారు.
కార్తీక్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ప్రోమోస్ అందరిని ఆకట్టుకున్నాయి. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. తన గత సినిమాలు కొన్ని ఆశించిన విజయం సాధించకపోవడం తో నవదీప్ ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

