ఈ రోజు మధ్యాహ్నం రామానాయుడు అంత్యక్రియలు

ఈ రోజు మధ్యాహ్నం రామానాయుడు అంత్యక్రియలు

Published on Feb 19, 2015 8:30 AM IST

Ramanaidu

తెలుగు చలన చిత్ర పరిశ్రమకి 50 ఏళ్ళుగా వెన్నుదన్నుగా నిలబడిన మరో సినీ తార నిన్న నేల రాలింది. ఆయనే దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత, మూవీ మొఘల్ డా. డి. రామానాయుడు. తెలుగు చలన చిత్ర నిర్మాణ రంగంలో ఆయన ఎనలేని సేవలని అందించారు. ఈ వార్తాతో తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఒక్కసారిగా దిగ్బ్రాంతి లోనైంది. అంతే కాకుండా ఈ లెజండ్రీ నిర్మాతకి అశ్రునివాళి అర్పించడం కోసం ఈ రోజు టాలీవుడ్ లో అన్ని కార్యక్రమాలను ఆపి వేసింది.

రామానాయుడు గారి అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి. ప్రస్తుతం ఆయన మృతదేహం సురేష్ బాబు గృహంలో ఉంది. ప్రజల సదర్శనార్ధం ఈ రోజు ఉదయం 9:30 నిమిషాల నుండి 1 గంట వరకూ రామానాయుడు స్టూడియోస్ లో ఉంచనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు రామానాయుడు స్టూడియోస్ లోనే దహన కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ దహన కార్యక్రమానికి ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ వచ్చి రామానాయుడు గారికి చివరి వీడ్కోలు చెప్పనున్నారు.

తాజా వార్తలు