‘ట్రూ జెట్’ పేరుతో రామ్ చరణ్ ఎయిర్ లైన్స్

‘ట్రూ జెట్’ పేరుతో రామ్ చరణ్ ఎయిర్ లైన్స్

Published on Feb 19, 2015 12:52 PM IST

Ram_Charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగానే కాకుండా ఇటీవలే ఐల్ లైన్స్ బిజినెస్ లో కూడా దిగనున్నట్లు తెలిపారు. ఈ వార్తా అప్పట్లో మీడియాలో హల్ చల్ చేసింది. ఈ విషయంపై రామ్ చరణ్ క్లారిటీ ఇస్తూ నాకు బిజినెస్ అంటే పెద్ద ఐడియా లేదని, తన భార్య ఉపాసన అన్నీ చూసుకుంటాను అంటేనే మనీ ఇన్వెస్ట్ చేసాసాని, ఆ ఎయిర్ వేస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తానని మాత్రం తెలిపాడు. తాజాగా రామ్ చరణ్ ప్రారంభించనున్న ఎయిర్ వేస్ కి ఒక పేరును ఫిక్స్ చేసారు.

రామ్ చరణ్ టర్బో మెగా ఎయిర్ వేస్ కలిసి సంయుక్తంగా చేయనున్న ఈ ఎయిర్ వేస్ కి ‘ట్రూ జెట్’ అనే పేరుని ఖరారు చేసారు. ఈ ఎయిర్ లైన్ సర్వీసెస్ ని ఏప్రిల్ చివరి నుంచి ప్రారంబించే ప్లాన్ లో ఉన్నారు. మొదటగా రెండు ఎయిర్ క్రాఫ్ట్స్ ఏప్రిల్ చివరి నుంచి మొదలైతే, సెకండ్ బత్చ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆగష్టు నుంచి మొదలవుతాయి. అలాగే మొదటి సెషన్ లో హైదరాబాద్ ని బేస్ చేసుకొని ఈ ఎయిర్ లైన్ సర్వీస్ ని విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, బెంగుళూరు, ఔరంగాబాద్ లకి ట్రావెల్ ప్లాన్ చేసారు. ఈ విషయాలను టర్బో మెగా ఎయిర్ వేస్ మానేజింగ్ డైరెక్టర్ వంకయలపటి ఉమేష్ తెలియజేశారు.

తాజా వార్తలు