
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం ‘స్వామి రారా’ ఫేం సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ మరియు కొన్ని పాటల చిత్రీకరణ తప్ప మిగతా షూటింగ్ అంతా పూర్తయ్యింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని మార్చి 20న రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఆ టైంకి అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోతే ఒకవారం వెనక్కి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. కానీ ప్రస్తుతానికైతే మార్చి 20ని ఫిక్స్ చేసినట్లు ఈ చిత్ర టీం అంటోంది.
నాగ చైతన్య ఈ సినిమాలో ఓ దొంగ పాత్రలో కనిపించనున్నాడు. నాగచైతన్య బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. నాగ చైతన్య సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. మధురిమ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్న ఈ సినిమాకి సన్నీ ఎం.ఆర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

