యూకేలో ఎన్టీఆర్ – సుకుమార్ సినిమా షూటింగ్..?

యూకేలో ఎన్టీఆర్ – సుకుమార్ సినిమా షూటింగ్..?

Published on Feb 21, 2015 9:23 AM IST

NTR_Sukumar1

‘టెంపర్’ సినిమా ఘన విజయంతో సంతోషంగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, తన తదుపరి సినిమాకు సంబందించిన పనులను వేగవంతం చేశారు. వైవిధ్యభరిత సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నెలాఖరు నుండి ప్రారంభమవుతుంది.

యూకే నేపథ్యంలో కథ ఉంటుందని సమాచారం. మేజర్ పార్ట్ షూటింగ్ సైతం అక్కడే జరుపుతారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు