
దర్శకుడు తేజ మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యారు. కొంత కాలం విరామం తర్వాత ఓ కొత్త సినిమా ప్రారంభించారు. మ్యూజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం కర్ణాటకలో కోబ్రాలు సంచరించే భయంకరమైన అటవీ ప్రాంతం ఆగుంబేలో షూటింగ్ జరుపుతున్నారు. నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్తవారే.
రంజిత్ మూవీస్ పతాకంపై దామోదర ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘హొరా హొరి’ అనే టైటిల్ ఖరారు చేశారు. కూచిభొట్ల వివేక్ సహ నిర్మాత. కళ్యాణ్ కోడూరి సంగీత దర్శకుడు. త్వరలో మిగతా వివరాలు వెల్లడించనున్నారు.

