
యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో బాగా బిజీగా ఉన్న మ్యూజిక్ కంపోసర్. వరుసగా తెలుగు మరియు తమిళంలో స్టార్ మ్యూజిక్ చేస్తున్న తమన్ చిన్న హీరోల సినిమాలకి మ్యూజిక్ అందిస్తూ బిజీగా ఉన్నాడు. ఇలా మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంత బిజీగా ఉన్నా తమన్ తనకు కుదిరిన ఖాళీ టైంలో చారిటీల కోసం లైవ్ పెర్ఫార్మన్స్ఇస్తున్నాడు. గతంలో కూడా హూద్హుద్ బాధితుల కోసం ఓ లైవ్ ఈవెంట్ చేసిన తమన మరోసారి ఫిబ్రవరి 28న మరి లైవ్ కాన్సెర్ట్ చెయ్యడానికి సిద్దమవుతున్నాడు.
ఎస్ఎస్ తమన్ ఇటీవలే తక్కాళి అనే మ్యూజిక్ బ్యాండ్ ని ప్రారంభించి, సౌత్ ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తూ పలు సామాజిక సేవల కోసం ఫండ్ రైజ్ చేస్తున్నాడు. పేద విద్యార్థుల కోసం ది కిన్నెర ఆర్ట్ థియేటర్ ఆర్గనైజింగ్ వారు ఓ మ్యూజికల్ కాన్సెర్ట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో తమన్ తన సింగర్స్ తో కలిసి లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నాడు.

