
అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అక్కినేని యంగ్ టాలెంట్ అఖిల్ ని ఫిబ్రవరి 14న గ్రాండ్ గా లాంచ్ చేయడమే కాకుండా ఫిబ్రవరి 16 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టారు. అఖిల్ ని పరిచయం చేస్తున్న వివి వినాయక్ ఈ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ హ్సెద్యోల్ హైదేబాద్ లోని పాత బస్తీలో జరుగుతోంది. అందులో ముందుగా ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. నిన్నటి నుంచి ఈ చిత్ర టీం నైట్ షూటింగ్ చేస్తున్నారు. నైట్ ఎఫెక్ట్ లో వచ్చే కొన్ని కీలక సీన్స్ ని షూట్ చేస్తున్నారు. దాంతో ఫుల్ నైట్ షూటింగ్ తో అఖిల్ బిజీగా ఉన్నాడు. వినాయక్ తీస్తున్న సీన్స్ అన్నీ సూపర్బ్ గా వస్తున్నాయని అఖిల్ చాలా హ్యాపీగా ఉన్నాడు.
ఈ సినిమాలో రొమాన్స్ కంటే ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని, వాటిని ఎంతో స్పెషల్ గా ఆడియన్స్ కి నచ్చేలా డిజైన్ చేస్తున్నారని ఈ చిత్ర టీం అంటోంది. నార్త్ ఇండియన్ భామ సయేశా సైగల్ అఖిల్ తో ఈ మూవీలో జోడీ కట్టనుంది. ఫస్ట్ షెడ్యూల్ తర్వాత అఖిల్ టీం సౌత్ ఆఫ్రికా, యుఎస్ లలో కీలక షెడ్యూల్స్ చేయనున్నారు. అఖిల్ మొదటి సినిమాకి ‘ఢమరుకం’ ఫేం వెలిగొండ శ్రీనివాస్ కథని అందిస్తుంటే కోన వెంకట్ – గోపి మోహన్ కథా సహకారం – డైలాగ్స్ అందిస్తున్నారు. నితిన్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

