కృష్ణంరాజుకి సక్సెఫుల్ గా జరిగిన సర్జరీ

కృష్ణంరాజుకి సక్సెఫుల్ గా జరిగిన సర్జరీ

Published on Feb 22, 2015 3:15 PM IST

krishnam-raju
నాటి తరం రెబల్ స్టార్ మరియు మాజీ యూనియన్ మినిస్టర్ అయిన కృష్ణంరాజు గత కొంతకాలంగా హృదయకోశ వ్యాధితో బాధపడుతున్నారు. దాంతో ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ లో చేరారు. కార్డియాలజీ డిపార్ట్ మెంట్ వారు కృష్ణంరాజుకి యాంజియోప్లాస్టీ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా చేసారు. అనగా ఆయనకి బ్లడ్ వెళ్ళకుండా బ్లాక్ అయి ఉన్న నాళాల బదులుగా రెండు హృదయ నాళాలను పెట్టారు. ఈ ఆపరేషన్ చాలా సక్సెఫుల్ గా జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుంది. త్వరలోనే ఆయన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా చేయనున్నారు.

రాజకీయాలలో పలు రోజులు సేవలందించిన కృష్ణంరాజు గత కొద్ది రోజులుగా అన్నిటికీ కాస్త విరామం ఇచ్చారు. ఆయన గత కొద్ది రోజులుగా ప్రభాస్ కోసం ఓ స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేస్తున్నారు. ఆ సినిమాని ఆయనే డైరెక్ట్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు అయిపోగానే ఈ సినిమా ఉంటుందని సమాచారం.

123తెలుగు.కామ్ తరపున హాస్పిటల్ నుంచి రెబల్ స్టార్ కృష్ణంరాజు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.

తాజా వార్తలు