
ఇండియాలో పలు భాషల్లో సినిమాలు చేసిన రాధిక ఆప్టే ‘రక్త చరిత్ర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సినిమాలో పెద్దగా గుర్తింపు రాకపోయినా నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమాతో టాలీవుడ్ లో రాధిక ఆప్టేకి మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ఈ భామకి ఎం టీవీ ఇంటర్నేషనల్ వారు నిర్మించబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో నటించే చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా 7 షార్ట్ ఫిలిమ్స్ సమూహారం. ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ ని ఒక్కో డైరెక్టర్ డైరెక్ట్ చేస్తాడు. అందరికీ షార్ట్ ఫిల్మ్ కథలు ఫర్బిడన్ లవ్ అనే పాయింట్ ని బేస్ చేసుకునే ఉంటుంది.
ఈ సినిమాలో ఇండియన్ షార్ట్ ఫిల్మ్ ని అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసాడు. ఈ షార్ట్ ఫిల్మ్ లో రాధిక ఆప్టే లీడ్ రోల్ చేస్తోంది. ఈ విషయం పై రాధిక ఆప్టే స్పందిస్తూ ‘ఎం టీవీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో నేను ఒక పార్ట్ అవ్వడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని’ అంటోంది. రాధిక ఆప్టే నటించిన ‘బదలాపూర్’ సినిమా గత శుక్రవారం విడుదలై మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇది కాకుండా రాధిక ఆప్టే త్వరలోనే బాలకృష్ణ సరసన ‘లయన్’ సినిమాలో కనిపించనుంది.

