
నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘లయన్’ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ శివార్లలోని మొయినాబాద్ ప్రాంతంలో జరుగుతోంది. అక్కడ బాలకృష్ణపై ఓ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. క్రేజీ ఫైట్ మాస్టర్స్ అయిన రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ ఈ యాక్షన్ ఎపిసోడ్ ని కంపోజ్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ మరింత బాగా రావడానికి రెయిన్ ఎఫెక్ట్ ని కూడా జత చేసారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఈ వారాంతం వరకూ అక్కడే జరగనుంది.
న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ టీజర్ రూపంలో నందమూరి బాలకృష్ణ తన ‘లయన్’ సినిమా ఎలా ఉంటుందా అనేది అభిమానులకు కాస్త సాంపిల్ చూపించాడు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో త్రిషతో పాటు రాధిక ఆప్టే కూడా మరో హీరోయిన్ గా కనిపించనుంది. సత్యదేవా దర్శకుడుగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మార్చి చివర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

