
సూపర్ స్టార్ మహేష్ బాబు – ‘మిర్చి’ ఫేం కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పొల్లాచ్చి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఉగాది కానుకగా అనగా మార్చి 21న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా మొదలైన రోజు నుంచి ఈ సినిమా కోసం పలు టైటిల్స్ వినిపిస్తున్నా ఒక్కటి కూడా ఖరారైన టైటిల్ కాదు. ప్రస్తుతం ఈ సినిమాకి వినిపిస్తున్న వర్కింగ్ టైటిల్ ‘జమిందార్’.
ప్రస్తుతం జరుగుతున్న పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి కాగానే ఈ చిత్ర టీం ఓ 12 రోజుల షెడ్యూల్ కోసం ఫ్రాన్స్ వెళ్లనున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్ స్టంట్ మాస్టర్ యాక్షన్ అణల్ అరసు యాక్షన్ కంపోజర్ గా పనిచేస్తున్నాడు. మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం, పూర్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

