
మాస్ మెచ్చే ఫైట్స్ ఉండాలి, కామెడీ అని కాకుండా ఓ మంచి కాన్సెప్ట్ ని ఎంచుకొని దాన్ని కమర్షియల్ గా ఎలా ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యలా అని ఆలోచించి కాస్త ఇంటెలిజెంట్ గా సినిమాలు చేస్తున్న యంగ్ హీరో నిఖిల్. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ లాంటి రెండు హిట్ సినిమాల తర్వాత నిఖిల్ ట్రై చేస్తున్న మరో డిఫరెంట్ సినిమా ‘సూర్య vs సూర్య’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
నిఖిల్ ఈ సినిమాలో తన అపర్త్ కి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసాడు. ఇంకా కొంతమంది నటీనటులు డబ్బింగ్ చెప్పాల్సి ఉంది.ఇటీవలే విడుదలైన ఆడియోకి, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎ కండిషన్ రిలేటెడ్ టు ప్రోఫ్ ఏరియా అంటే పగటి పూట బయటకి రాలేకపోవడం. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని వస్తున్న ఈ సినిమా ద్వారా త్రిద చౌదరి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా చేసిన కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి మల్కాపురం శివకుమార్ నిర్మాత.

