
శర్వానంద్, నిత్యా మీనన్ జంటగా నటించిన ముస్లిం – హిందూ యువతి యువకుల ప్రేమకథ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’. ఫిబ్రవరి మొదటివారంలో విడుదలైన ఈ సినిమా చక్కని విజయం సాదించింది. ఇప్పుడు ఈ సినిమాను ‘నాన్ నీ నామ్’ పేరుతో అనువదిస్తున్నారు. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కెఎస్ రామారావు సమర్పణలో కె.ఏ.వల్లభ నిర్మించారు. శర్వానంద్, నిత్యా మీనన్ ల నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. వీరిద్దరికీ తమిళంలో మంచి క్రేజ్ ఉండడం, సినిమా బాగుండుండడంతో అక్కడ కూడా తప్పకుండా విజయం సాదిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రేమకథా చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

