వేసవిలో అలరించనున్న ‘కిక్ 2’

వేసవిలో అలరించనున్న ‘కిక్ 2’

Published on Feb 23, 2015 11:17 PM IST

kick-2
రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ‘కిక్ 2’ సినిమా వేసవిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధపడుతుంది. ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్, మే నెలలో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదలకోసం మంచి రిలీజ్ డేట్ ని చూస్తున్నట్టు తెలుస్తుంది.

సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కధను అందించిన విషయం తెలిసినదే. వీరి కాంబినేషన్ లో వచ్చిన రేసు గుర్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. థమన్ సంగీతదర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం పొల్లాచిలో కొన్ని ముఖ్యసన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంది.

తాజా వార్తలు