ఉత్తమ విలన్ సౌండ్ మిక్సర్ కి దక్కిన ఆస్కార్

ఉత్తమ విలన్ సౌండ్ మిక్సర్ కి దక్కిన ఆస్కార్

Published on Feb 23, 2015 11:28 PM IST

theyam-and-uthama-villain
కమల్ హాసన్ నటిస్తున్న ‘ఉత్తమ విలన్’ సినిమాకు సౌండ్ మిక్సర్ గా పనిచేస్తున్న క్రైగ్ మ్యాన్ కి ప్రతిష్టాత్మక 87 ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో ‘విప్ ల్యాష్’ సినిమాకి గానూ ఆస్కార్ దక్కింది. ఈ అవార్డును బెన్ వికిన్స్ మరియు థామస్ కర్లీ తో కలిసి ఈ అవార్డుని పంచుకున్నారు.

క్రైగ్ గతంలో ‘ది బార్న్ అల్టిమాటం’, ‘ఇన్సీడియస్ : చాప్టర్ 2’ మరియు ‘కాప్టైన్ అమెరికా’ వంటి సినిమాలకు సంగీతం అందించాడు. కమల్ ప్రతిష్టాత్మకమైన పారామౌంట్ స్టూడియోస్ లో తన సినిమాకి రీ రికార్డింగ్ చేస్తున్నాడు.

కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో ఈ ఉత్తమ విలన్ రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. మార్చ్ 1న ఆడియో, ఏప్రిల్ 2న సినిమా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు