మంచు మనోజ్ సరసన సురభి

మంచు మనోజ్ సరసన సురభి

Published on Feb 24, 2015 1:01 AM IST

manij-surabhi
విలక్షణ మరియు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మంచు ఫ్యామిలీ హీరోలైన మంచు మోహన్ బాబు, మంచు విష్ణులతో ‘రౌడీ’, ‘అనుక్షణం’ సినిమాలు చేసాడు. అంతే కాకుండా మంచు లక్ష్మీతో ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేసాడు. ఇప్పుడు మంచు వారబ్బాయి మంచు విష్ణుతో ‘గొలుసు’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ గత శనివారమే మొదలైంది. మొదటగా మనోజ్ పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు.

ఈ సినిమాలో మంచు మనోజ్ తో పాటు జగపతి బాబు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే మంచు మనోజ్ ని డీ కొట్టే నెగటివ్ షేడ్స్ లో వడ్డే నవీన్ కనిపించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మంచు మనోజ్ సరసన సురభి జోడీ కట్టనుంది. సురభి ఇటీవలే వచ్చిన ‘బీరువా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మంచు విష్ణుకి తన సినిమాలతో డిఫరెంట్ ఇమేజ్ తెచ్చి పెట్టిన వర్మ ఈ సినిమాతో మంచు మనోజ్ కి ఎలాంటి మేకోవర్ ఇస్తాడనేది చూడాలి.

తాజా వార్తలు