యూరోప్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న హన్సిక.

యూరోప్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న హన్సిక.

Published on Feb 24, 2015 1:19 AM IST

hansika
తెలుగు, తమిళ సినిమాల షూటింగులతో గత ఎనిమిది నెలల నుండి క్షణం తీరిక లేకుండా గడిపిన పాలబుగ్గల సుందరి హన్సిక, ఓ ఐదు రోజుల పాటు బ్రేక్ తీసుకుంది. ఈ బ్రేక్ టైంలో క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి యూరోప్ ట్రిప్ వేసింది. అక్కడ డాల్ఫిన్ లకు ముద్దులు పెడుతూ ఎంజాయ్ చేస్తుంది. హన్సిక యూరోప్ ట్రిప్ వేయడం ఇది రెండవసారి. ఈ ట్రిప్ పూర్తయిన తర్వాత తను దత్తత తీసుకున్న చిన్నారులను తీసుకుని ఇండియాలో హాలిడేకి వెళ్తుందని సన్నిహిత వర్గాల సమాచారం.

ప్రతి ఏడాది పుట్టినరోజు నాడు అనాధ చిన్నారులను హన్సిక దత్తత తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వారితో కొన్ని రోజులు సరదాగా గడపడం ఈ అమ్మడికి అలవాటు. ఈ ఏడాది బిజీ షెడ్యూల్ వలన వారితో టైం స్పెండ్ చేయడం కుదరలేదు. యూరోప్ ట్రిప్ అయిన తర్వాత పిల్లలతో కలిసి లోనవాలా వెళ్తుంది. అని హన్సిక క్లోజ్ ఫ్రెండ్ ఒకరు తెలిపారు.

తాజా వార్తలు