
ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్ తన గురువుగారైన దివంగత మాండలిన్ శ్రీనివాస్ రావుగారి మొదటి వర్ధంతికి జ్ఞాపకార్ధంగా ఒక ప్రత్యేకమైన గీతాన్ని కంపోజ్ చేయనున్నాడు. మాండలిన్ శ్రీనివాస్ గారు కేవలం 45 సంవత్సరాలకే గత సెప్టెంబర్ లో మనల్ని వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరం.
ఆయన దగ్గర శిష్యరికం తీసుకున్న దేవిశ్రీ ప్రసాద్ ఈ నెల 28న చెన్నైలో జరగనున్న గ్రేట్ ‘మ్యాన్’డలిన్ వేడుకలో ప్రదర్శన ఇవ్వనున్నాడు. దేవీనే కాక ఆ వేడుకలో ఉస్తాద్ జాకిర్ హుస్సేన్, విక్కూ వినాయకరామ్, హరిహరన్, శంకర్ మహదేవన్ లు ప్రదర్శన ఇవ్వనున్నారు.

