
ఎంతో కాలంగా నందమూరి అభిమానులు మరియు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కోరుకుంటున్న హిట్ సినిమాని ‘టెంపర్’ అందించింది. ఈ సినిమా మొదటి రోజు నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. ఇటీవలే ఈ సినిమా యుఎస్ లో 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. ప్రస్తుతం టెంపర్ నైజాంలో 10 కోట్ల మార్క్ కి దగ్గరవుతోంది. మాకు అందిన ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం నిన్నటి వరకూ టెంపర్ సినిమా నైజాంలో 9.7 కోట్ల షేర్ సాధించింది. మరో ఒకరి రెండు రోజుల్లో ఈ సినిమా 10 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందని డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు.
ఎన్.టి.ఆర్ లుక్స్ పరంగా ఎన్నడూ లేనంత స్టైలిష్ గా కనిపించడమే కాకుండా యాక్టింగ్ మరియు డైలాగ్ డెలివరీలో కూడా కొత్తదనం చూపించి టెంపర్ తో ప్రేక్షకులను మెప్పించాడు. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ ఎమోషనల్ పోలీస్ డ్రామాని బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించాడు. కాజల్ అగర్వాల్ గ్లామర్ ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి వారం 35 కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా రెండవ వారానికి 40 – 45 కోట్ల షేర్ సాధిస్తుందని అంటున్నారు.

