టాలీవుడ్ కి పరిచయమైన మరో లేడీ రైటర్

టాలీవుడ్ కి పరిచయమైన మరో లేడీ రైటర్

Published on Feb 24, 2015 9:00 PM IST

Kanika-Dhillon-Kovelamudi
ఇప్పటివరకూ శ్రీమతి విజయ నిర్మల, నందిని రెడ్డి, శశికిరణ్ నారాయణ లాంటి లేడీ రైటర్స్ తెలుగు చిత్ర సీమకి పరిచయమై తమ టాలెంట్ ని నిరూపించుకున్నారు. వీరి బాటలోనే రాఘవేంద్ర రావు కోడలు, ప్రకాష్ కోవెలమూడి భార్య అయిన కనిక ధిల్లన్ కోవెలమూడి తెలుగు ప్రేక్షకులకు రచయితగా పరిచయం కానుంది. అనుశాక్ ప్రధాన పాత్రలో నటించనున్న ‘సైజ్ జీరో’ అనే సినిమా నిన్ననే లాంఛనంగా ప్రారంభమయ్యింది. ప్రకాష్ కోవెలమూడి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాని పివిపి సినిమాస్ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించనున్నాడు.

ఈ సినిమాకి కనిక ధిల్లన్ కథని అందించింది. ఇండియాలో బాగా సేల్ అయిన ‘బాంబే డక్ ఈజ్ ఎ ఫిష్’ అనే నవల ద్వారా కనిక ధిల్లన్ బాగా ఫేమస్ అయ్యింది. కనిక ధిల్లన్ షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ లో క్రియేటివ్ కంటెంట్ డివిజన్ కి హెడ్ గానే కాకుండా ఎన్డీ టీవీ ఇమాజిన్ కి కూడా పనిచేస్తుంది. అంతే కానకుండా కనిక షారుఖ్ నటించిన ‘ఓం శాంతి ఓం’, ‘బిల్లు బార్బర్’, ‘రా వన్’ సినిమాలకు కో రైటర్ గా పనిచేసింది. గత సంవత్సరం ఆగష్టులో ప్రకాష్ కనికని పెళ్లి చేసుకున్నాడు. అనుశాక్ సినిమాకి కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా కనిక అందిస్తుండడం విశేషం.

తాజా వార్తలు