త్వరలో సందడి చేయనున్న ఇద్దరు సుబ్రహ్మణ్యాలు రెండు టైగర్ లు

త్వరలో సందడి చేయనున్న ఇద్దరు సుబ్రహ్మణ్యాలు రెండు టైగర్ లు

Published on Feb 25, 2015 9:11 AM IST

Yevade-subramnayam-subramna
టాలీవుడ్ లో నేమింగ్ కి ముఖ్యస్థానం వుంది. టైటిల్ పేరుతోనే సినిమా రిజల్ట్ ని జడ్జ్ చెయ్యగలిగే పండితులకు ఇక్కడ కొదవలేదు. అయితే ఒక సినిమా పేరుతొ మరొక సినిమా పేరు ఎప్పుడో గానీ క్లాష్ అవ్వదు. కానీ త్వరలో మనముందుకు ఏకకాలంలో ఒకే విధంగా తలపించే రెండు విభిన్న ప్రాజెక్ట్ లు పలకరించనున్నాయి.

నాని వరుస పరాజయాల తరువాత వస్తున్న ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమా పాటలు ఇప్పటికే విడుదలై మంచి స్పందనని అందుకుంటున్నాయి దాదాపు ఇదే పేరుతొ హరీష్ శంకర్ – సాయి ధరమ్ తేజ లు ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ అనే ప్రాజెక్ట్ ని చిత్రీకరిస్తున్నారు. ఇక సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో వస్తున్న ‘టైగర్’ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై వార్తలలో నిలిచింది. రవితేజ – సంపత నందిల ప్రాజెక్ట్ ‘బెంగాల్ టైగర్’ కూడా అదే టైటిల్ కాంటెక్స్ట్ మన ముందుకు రానుంది. ఒకేవిధమైన పేర్లు ఒకేసారి విడుదలకావడం కాస్త కొత్త విషయమేకదూ..

తాజా వార్తలు