కన్నడలో ‘పటాస్’ రీమేక్..

కన్నడలో ‘పటాస్’ రీమేక్..

Published on Feb 25, 2015 3:26 PM IST

patas-movie-review
నందమూరి కళ్యాణ్ రామ్, శృతి సోది జంటగా నటించిన ‘పటాస్’ సినిమా గత నెలలో విడుదలై మంచి విజయం సాదించింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీకి మంచి ప్రాముఖ్యత ఇచ్చారు. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టిగా పేలింది. మంచి వసూళ్లు సాదించింది. ఇప్పుడు ఇతర సినిమా ఇండస్ట్రీల దృష్టి ఈ సినిమాపై పడింది. ‘పటాస్’ రీమేక్ రైట్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

తాజాగా కన్నడలో స్టార్ హీరోతో ‘పటాస్’ సినిమాను రీమేక్ చేయడానికి రంగం సిద్దమయింది. కన్నడంలో ప్రముఖ నిర్మాత ఎస్.వి.బాబు, ‘పటాస్’ రైట్స్ సొంతం చేసుకున్నారు. తమిళ, హిందీ సినిమా ఇండస్ట్రీ నుండి రీమేక్ రైట్స్ కోసం భారి పోటి నేలకొందట.

తాజా వార్తలు