డ్రగ్స్ కేసులో తనకు సంబంధం లేదన్న యంగ్ హీరో

డ్రగ్స్ కేసులో తనకు సంబంధం లేదన్న యంగ్ హీరో

Published on Feb 25, 2015 4:00 PM IST

nandhu
చాలా రోజుల నుంచే మన టాలీవుడ్ లో పలువురు పైన డ్రగ్స్ కేసులు వేస్తూనే ఉన్నారు, కొందరు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. తాజాగా ఓ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కూడా డ్రగ్స్ రాకెట్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని హైదరాబాద్ పోలీస్ డిపార్ట్ మెంట్ తెలియజేసింది. ఆ కేసులో యంగ్ యాక్టర్ నందు కూడా ఉన్నాడని మీడియాలో వార్తలు వచ్చాయి. 100% లవ్, ఆటోనగర్ సూర్య, ఐస్ క్రీం 2 సినిమాలతో పరిచయం ఉన్న నందుపై ఈ నింద పడండంతో ఈ వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కానీ నందు మీడియా ముందుకు వచ్చి ఈ రూమర్స్ లో అస్సలు నిజం లేదని చెప్పాడు. ‘అసలు ఈ డ్రగ్స్ కేసుకి నాకు అస్సలు సంబంధం లేదు, నేను పోలీసులకు కో ఆపరేట్ చెయ్యడానికి రెడీగా ఉన్నాను. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారి గురించి నాకు పెద్దగా సంబంధం లేదని’ తెలిపాడు. నందుకి ఇప్పుడిప్పుడే మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం నందు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ‘365 డేస్’ అనే సినిమా చేస్తున్నాడు.

తాజా వార్తలు