తమిళంలో మారనున్న ‘బాహుబలి’ టైటిల్

తమిళంలో మారనున్న ‘బాహుబలి’ టైటిల్

Published on Feb 26, 2015 11:27 AM IST

Baahubali
ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్ళే దిశగా అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న సినిమా ‘బాహుబలి’. సూపర్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషలలో రిలీజ్ చేసే విధంగా ఈ చిత్ర టీం ముందు నుంచే ప్లాన్ చేసింది. అందులో భాగంగానే తమిళంలో మహాబలి అనే టైటిల్ అనుకున్నారు. కానీ తాజా ఈ చిత్ర టీం మూడు భాషలకి కలిపి ఒకే టైటిల్ ఉంటే సినిమాకి రీచ్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో మూడు భాషలకు కలిపి ఒకే టైటిల్ ని పెట్టాలని, తమిళ టైటిల్ ని మార్చేయాలని అనుకున్నారు.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మూడు భాషలకి కలిపి ‘బాహుబలి’ అనే టైటిల్ ని పెట్టాలని ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది. బాహుబలి సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి పార్ట్ కి సంబందించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం ఫస్ట్ పార్ట్ లో బాలన్స్ ఉన్న రెండు పాటలని రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకుంటున్న ఈ సినిమా మొదటి పార్ట్ ని మే లో రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు. ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు