సౌత్ ‘క్వీన్’గా నిత్యా మీనన్..?

సౌత్ ‘క్వీన్’గా నిత్యా మీనన్..?

Published on Feb 27, 2015 2:15 PM IST

Nithya-Menon
గ్లామర్ జోలికి పోకుండా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను, కథలను ఎంపిక చేసుకుంటున్న హీరోయిన్ నిత్యా మీనన్. ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఓ సినిమాకు సంతకం పెడితే, అది హిట్ అనే అభిప్రాయం ప్రేక్షకులలో ఏర్పడింది. హిందీలో సూపర్ హిట్టయి, కంగ‌నా ర‌నౌత్ కు మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ‘క్వీన్’. ఇప్పుడు ‘క్వీన్’ రీమేక్ నిత్యా చెంతకు చేరింది.

‘క్వీన్’ సినిమా దక్షినాది భాషల రీమేక్ హక్కులను ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో రీమేక్ చేయడానికి గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. త్రిష, నయనతార, సమంత, ఆశిన్, ఛార్మి ఇలా కొందరి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఎవరు ఖరారు కాలేదు. నాలుగు భాషలలో నిత్యా బాగా పాపుల‌ర్‌. ఆమెకు సైతం ఈ త‌ర‌హా ప్రయోగాలంటే ఇష్టం. దాంతో నిత్యాను సంప్రదించారు. ఓకే అనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సమాచారం.

తాజా వార్తలు